చేవెళ్లటౌన్, నవంబర్ 1: చేవెళ్ల నియోజవర్గంలో బీఆర్ఎస్కు తిరుగు లేదు.. ప్రతి పక్షాలకు చోటు లేదని, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ గూటికి చేరడం మంచి నిర్ణయమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ అంబేద్కర్‌నగర్ కాలనీలోని పోచమ్మ ఆలయ సమీపంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో, చేవెళ్ల కొజ్జెంకి దర్శన్ ఆధ్వర్యంలో వంద మంది నాయకులు ఇతర పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ వారికి కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్. బీజేపీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.
రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, మాజీ వైస్ చైర్మన్లు మాణిక్యారెడ్డి, నర్సింహులు, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎర్రమల్లేశ్, యూత్ మండల అధ్యక్షుడు శేఖర్, మండల ఉపాధ్యక్షుడు నరేందర్ గౌడ్, సర్పంచ్‌లు మాణిక్యారెడ్డి, శంకర్, చేవెళ్ల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి, డైరెక్టర్లు వెంకటేశ్, కృష్ణ, ఫయాజ్, సాయినాథ్, నాయకులు కృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, సత్తి, సాయి కుమార్ రెడ్డి, రామాగౌడ్, ఘని, శేఖర్ రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.