MLA Sabitha | కందుకూరు, ఫిబ్రవరి 20 : గ్రామాలతో పాటు గిరిజన తండాల అభివృద్ధికి మాజీ మంత్రి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కృషి చేస్తున్నట్లు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ కాట్రోత్ దేవీలాల్ నాయక్ తెలిపారు. గుమ్మడవెల్లి తండా గేట్ నుంచి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.80 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ సర్పంచులు భద్రయ్య మస్కు బాబులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంతో పాటు తండా అభివృద్ధికి నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి రోడ్లకు నిధులు మంజూరు చేసి పనులను పూర్తి చేస్తే, సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిధులు మంజూరు చేశాడని పేర్కొనడం సిగ్గు చేటని తెలిపారు. నేటి కూడా రూపాయి మంజూరు చేసిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రిగా సబితా ఇంద్రా రెడ్డి నిధులు తీసుకొచ్చి గ్రామాలను, తండాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధికి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిధులు మంజూరు చేసిన సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏకుల మల్లేష్, రాజు నాయక్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.