కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ (Thimmapur) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున షాద్‌నగర్ వైపు నుంచి మామిడిపండ్ల లోడ్‌తో వస్తున్న లారీ తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులోని మామిడిపండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
కాగా, లారీ బోల్తాపడిన విషయం తెలుసుకున్న ప్రజలు ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రోడ్డుపై పడిన మామిడిపండ్లను ఏరుకుని సంచుల్లో, బుట్టల్లో నింపుకుని తీసుకెళ్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.