మైలార్‌దేవ్‌పల్లి, జూలై 3: అత్తాపూర్ డివిజన్ హైదర్‌గూడ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం మండల పూజ మహోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. బాబు జగ్జీవన్‌రామ్ యూత్ అసోసియేషన్, ప్రణవ భక్త సమాజం ఆధ్వర్యంలో దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన యంత్ర ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన చేసుకోని 41 రోజులు పూర్తయిన సందర్భంగా అమ్మవారి శిఖరానికి కుంబాభిషేకం, హోమం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ పూజల్లో స్థానిక ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
3 BHK Movie | రూ.150లకే 3BHK.. ప్రమోషన్స్ మాములుగా లేదు.!