3 BHK Movie | నటుడు సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 3 BHK. ఈ సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తుండగా.. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు, మీఠా రఘునాథ్, చైత్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 4న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుండగా.. అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రబృందం. ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేయగా.. మంచి వ్యూస్ రాబడుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ని డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు మేకర్స్.
3BHK కొనాలంటే రూ. 75 లక్షలు అవసరం లేదు.. కేవలం రూ.150 చాలంటూ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక మధ్యతరగతి కుటుంబం సొంత ఇల్లు కొనడానికి పడే పాట్లను, వారి కలలను ఆవిష్కరించే భావోద్వేగభరితమైన కుటుంబ డ్రామాగా రాబోతుంది.
Bestest campaign! 😁@iamarunviswa @ShanthiTalkies Really good one. Spotted this near T.Nagar and it instantly made me smile. pic.twitter.com/x7X8Ikx4kc
— Maathevan (@Maathevan) July 2, 2025