నందిగామ, జనవరి 5: మండలంలోని చేగూ రు గ్రామంలో ఎనిమిది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతివనాన్ని గురువారం కేంద్ర అధికారుల బృందం పరిశీలించింది. నాటిన మొక్కలు ఏపుగా పెరుగడంతో.. వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను చేగూరు సర్పంచ్ సంతోష, పాలకవర్గ సభ్యులను కేంద్రం బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. బీపీపీవీ నిర్వహణ బాగుందని పాలకవర్గాన్ని అభినందించారు. ఈ బృందంలో అమర్‌జిత్‌సిన్హా, అశోక్పంకజ్, ప్రవీణ్‌తోపాటు అటవీశాఖ కమిషనర్ ప్రసాద్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎం పీపీ ప్రియాంకాగౌడ్, చేగూరు పీఏసీఎస్ మా జీ చైర్మన్ విఠల్, తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్‌ఖాన్, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో గిరిరాజ్, ఏఈ కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ నుంచి శబరిమలకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సును షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్ గురువారం ప్రారంభించారు. షాద్‌నగర్‌కు చెం దిన పలువురు అయ్యప్ప స్వాములు శబరిమలకు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నట్లు డీఎం ఉష తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుందన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పయనించేలా ఆర్టీసీ ఉదోగ్యులు, కార్మికులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బదిలీపై వెళ్తున్న డీఎం సురేఖ, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
-షాద్‌నగర్ రూరల్, జనవరి 5