కేశంపేట, ఫిబ్రవరి 06: అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. కేశంపేట సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన మంగలి జంగయ్య(45) కొందుర్గు మండలంలోని బీసీ వెల్ఫేర్ వసతిగృహంలో వంట మనిషిగా పని చేస్తున్నాడన్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న జంగయ్య మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన కుటుంబ సభ్యులతో అనారోగ్యం విషయమై చెప్పి మనోవేధనకు గురయ్యాడని పేర్కొన్నారు.
వేధిస్తున్న అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తితో ఉన్న జంగయ్య ఈ నెల 5న రాత్రి సమయంలో ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంట్లోని రేకుల పైపుకు స్కార్ఫ్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు జంగయ్యను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడని, పోస్టుమార్టంకోసం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారన్నారు. మృతుని కుమారుడు మంగలి శ్రీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.