వికారాబాద్, మార్చి 8 : 300 పడకల దవాఖాన ప్రారంభం ఎప్పుడో.. అని రోగులు, ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 50 పడకల ప్రభు త్వ ఏరియా దవాఖానకు రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతున్నది. ప్రతిరోజూ దాదాపుగా వెయ్యి మంది వరకు వైద్యం కో సం వస్తున్నారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభు త్వం రోగులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పించేందుకు రూ.30 కోట్లతో మరో 300 పడకల దవాఖానను ఏర్పాటు చేసింది. చిన్న చిన్న పనులు ఉండగా ఇటీవల పూర్తయ్యాయి. అయితే, గత రెండు, మూడు నెలల కిందటే ఈ దవాఖాన ప్రారంభోత్సవం కావాల్సి ఉండగా.. వైద్యారోగ్య శాఖ మంత్రి గారు రాకపోవడంతో పెండింగ్లో పడిపోయింది. మంత్రిగారు స్పం దించి ఆస్పత్రిని ప్రారంభిస్తే తమకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని ప్రజలు, రోగులు కోరుతున్నారు.