బంట్వారం : రైతులు మెలుకవలు పాటిస్తే మొక్క జొన్నలో (Maize) అధిక లాభం పొందుతారని సెక్షన్ అధికారి రాఘవేందర్‌రెడ్డి ( Raghavender Reddy) పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని బస్వపూర్ రైతు బొగ్గుల వెంకటయ్య పొలంలో మొక్క జొన్న రైతులకు అవగాహాన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీపీ విత్తనాలు నేడు అధిక దిగుబడి ఇస్తున్నాయన్నారు.
ఎకరాకు 40 క్వింటాళ్ల నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. రైతులు అధిక దిగుబడిని సాధించాడానికి కొన్ని సూచనలు పాటించాలన్నారు. ప్రధానంగా ఈ పంట అక్టోబర్ -డిసెంబర్ మాసంలో వేయాలన్నారు. విత్తనాలు విత్తే ముందు ఒక్కో విత్తనానికి ఒక అడుగు దూరంలో నాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కుందెళ్ల నరేష్, నారాయణ, ప్రభు తదితరులు పాల్గొన్నారు.