పెద్దేముల్, డిసెంబర్ 20: విద్యారంగంలో సమూల మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం మన ఊరు-మన బడి కార్యక్రమానికి రూపకల్పన చేసి, ప్రత్యేక నిధులను కేటాయిస్తూ.. సర్కారీ బడుల రూపురేఖలను పూర్తిగా మార్చుతున్నారు. మండలంలో మొత్తం 19 పాఠశాలలుండగా.. అందులో 10 ప్రాథమిక, రెండు ప్రాథమికోన్నత, ఏడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మొదటి విడుతలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తు తం రెండు ప్రాథమిక పాఠశాలల్లో పనులు పూర్తి కావొచ్చాయి. మిగిలిన బడుల్లోనూ పనులు కొనసాగుతున్నాయి. ‘మన ఊరు -మన బడి’తో ప్రభుత్వ బడులు సమస్యల్లేనివి మారుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు, ప్రజాప్రతి నిధులు పేర్కొంటున్నారు.
చివరి దశలో పనులు
కందనెల్లి, మంబాపూర్ ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న పనులు చివరి దశకు చేరాయి. కందనెల్లి ప్రాథమిక పాఠశాలలో 150 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు న్నారు. వారి సౌకర్యార్థం పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్స్, ట్యూబ్‌లైట్లు, బోర్డులు, సంపు, నూతన వాటర్ ట్యాంకు, బోర్ మోటర్, పైప్‌లైన్, మరుగుదొడ్లు తదితర పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అదేవిధంగా మంబాపూర్ ప్రాథమిక పాఠశాలలో 86 మంది విద్యార్థులుండగా.. ఆరుగురు టీచర్లున్నాయి. వారి సౌకర్యార్థం పెయింటింగ్, ఎలక్ట్రిసి టీ, ఫ్యాన్స్, ట్యూబ్‌లైట్లు, బోర్డుల ఏర్పాటు, కిటికీలు, ఫ్లోరింగ్ తదితర పనులు పూర్తయ్యాయి. పాఠశాలలు సుందరంగా మారుతుండటంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
19 బడులకు రూ.4 కోట్ల పైచిలుకు నిధులు..
‘మన ఊరు-మన బడి’లో భాగంగా మౌలిక వసతుల కల్పనకోసం మొదటి విడుతలో మండలంలోని 19 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో సౌకర్యాలు కల్పించేందుకు రూ.నాలుగు కోట్ల పైచిలుకు నిధులను మంజూరు చేసింది. కాగా 19 పాఠశాలల్లో కందనెల్లి, మంబాపూర్ బడులను మోడల్‌గా తీసుకుని.. పనులు చేపట్టడంతో చివరి దశకు చేరాయి. అదేవిధంగా అడికిచెర్ల, ఇందూరు, ఇందూరు ఉరూ ్దమీడియం, కందనెల్లి, మంబాపూర్, మారేపల్లి, పాషాపూ ర్, పెద్దేముల్, తట్టేపల్లి, ఊరెంటితండా గ్రామాల పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో జనగాం, నాగులపల్లి పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో పెద్దేముల్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, అడికిచెర్ల, ఇందూరు ఉర్దూమీడియం, కందనెల్లి, మంబాపూర్, మారేపల్లి ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వం మన ఊరు-మన బడిలో భాగంగా నిధులను మంజూరు చేసింది.
అన్ని గదుల్లోనూ ఫ్యాన్లు ఉన్నాయి
మా పాఠశాల ‘మన ఊరు-మన బడి’లో పరిశుభ్రంగా మారిపోయింది. పాఠశాల గో డలు, భవనానికి పెయింటింగ్ వేయడంతోపాటు విద్యుత్ సౌకర్యం కల్పించారు. అంతేకాకుండా అన్ని గదుల్లోనూ కొత్తగా ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు.
-కీర్తన, నాల్గోతరగతి విద్యార్థిని, కందనెల్లి ప్రాథమిక పాఠశాల
మా పాఠశాల సుందరంగా మారింది
గతంలో మా పాఠశాలలో సరైన వసతులు లేకుండే. కానీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మన ఊరు-మన బడి’తో అన్ని వసతులు సమకూరాయి. పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ, తాగునీటి సౌకర్యం, మైనర్ మరమ్మతులను చేపట్టడంతో పాఠశాల సుందరంగా మారింది. మా పాఠశాలను ఆధునీకరించిన సీఎం కేసీఆర్‌కు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు.
-సాదియా సుల్తానా, ఐదోతరగతి విద్యార్థిని, మంబాపూర్ ప్రాథమిక పాఠశాల
ప్రభుత్వ బడులకు వరం..
మన ఊరు-మన బడి కార్యక్రమం సర్కారు బడులకు వరం లాంటిది. మండలంలో 19 పాఠశాలలను ప్ర భుత్వం మొదటి విడుతలో ఎంపిక చేసి నిధులను కూడా మంజూరు చేసింది. రెండు పాఠశాలల్లో అవసరమైన మౌలి క వసతుల పనులు చివరి దశకు చేరుకోగా.. మిగిలిన బడుల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. పను లు పూర్తై ఎంబీ రికార్డు అయిన వారం రోజుల్లోనే డబ్బులు వచ్చేస్తున్నాయి. బడుల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా సంతోషకరం.
-వెంకటయ్యగౌడ్, ఇన్చార్జి ఎంఈవో, పెద్దేముల్ మండలం
బడుల రూపురేఖలు మారుతున్నాయి
ప్రభుత్వం బడుల బాగుకు పెద్దమొత్తంలో నిధులను విడుదల చేస్తుండటం హర్షణీయం. మన ఊరు-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని బడు ల రూపురేఖలు మారుతున్నాయి. అన్ని పాఠశాలల్లోనూ మౌలిక వసతులు సమకూరుతున్నాయి. మా పాఠశాలలోనూ మౌలిక వసతులు సమకూరు తున్నా యి. మా పాఠశాలను మొదటి విడుతలో ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, డీఈవో, ఎంఈవో, ప్రజాప్రతినిధులకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు.
-వారిజ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, కందనెల్లి ప్రాథమిక పాఠశాల
పాఠశాల కొత్త రూపు సంతరించుకున్నది
‘మన ఊరు-మన బడి’తో మా పాఠశాల కొత్త రూపును సంతరించుకున్నది. పాఠశాల భవనం గోడలకు పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ తదితర మౌలిక వసతులను కల్పించారు. విద్యార్థులకు అన్ని రకా ల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం వసతులు కల్పిస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-వీరప్ప, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం,మంబాపూర్ ప్రాథమిక పాఠశాల