ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ దర్శించుకున్నారు.
అన్ని శివాలయాలు పంచాక్షరి మంత్రంతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకొని ఆ దేవదేవుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. మహేశ్వరంలో ఎమ్మెల్యే సబితారెడ్డి, శంకర్పల్లి మండలం చందిప్ప మరకత శివలింగాన్ని నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు దర్శించుకున్నారు.