ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 21 : గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా చిలుక మధుసూదన్‌రెడ్డి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తన ఎన్నికకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
గడ్డిఅన్నారం మార్కెట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చించి పరిష్కరించేందుకు పాటుపడతానన్నారు. మార్కెట్ అభివృద్ధికి రైతులు, పాలకవర్గం, ప్రజాప్రతినిధులు అన్ని విధాలుగా సహకరించాలని ఆయన కోరారు. అనంతరం ఆయనను పాలకవర్గంతో పాటుగా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు.