‘మద్యం మత్తులో డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయి ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కేసు నమోదుతోపాటు డ్రైవర్ల లైసెన్స్‌లు రద్దు చేసేందుకు అధికార యంత్రాంగం పరిశీలిస్తున్నది. ప్రస్తుతం ఆర్టీఏ అధికారుల ముందు 2,412 లైసెన్సుల రద్దు పరిశీలనకు ఉండడం విశేషం. ఇందులో మందుబాబులే అధికంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 16,904 లైసెన్స్‌లు రద్దయ్యాయి.’
Drunk and Drive | సిటీబ్యూరో : వాహనదారుల నిర్లక్ష్యంపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై డ్రైవింగ్ లైసెన్స్ రద్దును ప్రయోగిస్తున్నా రు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై, ట్రాఫిక్, రవాణా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నా రు. తొలుత జరిమానాలతో సరిపెడుతూనే, పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌లనూ రద్దు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చే లైసెన్సుల రద్దు ప్రక్రియను వేగవంతం చేసి ఉల్లంఘనులను బెంబేలెత్తిస్తున్నారు. లైసెన్స్‌ను సస్పెండ్ చేసేందుకు కేసులను రెండు కేటగిరీలుగా విభజించారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులను మొదటి కేటగిరీగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న వాటిని రెండో కేటగిరీగా వర్గీకరించి కేసులు నమోదు చేస్తున్నారు. వీటితోపాటు రోడ్డు ప్రమాదాల నివారణపై శాశ్వతంగా డ్రైవిం గ్ లైసెన్స్‌లు రద్దు చేసే ప్రక్రియపైనా కసరత్తు చేస్తున్నారు. కారు నంబర్‌పై స్పీడ్ లేజర్ గన్ చిత్రీకరించిన దృశ్యాలను చూ స్తూ పలుమార్లు అతివేగంతో ప్రయాణించడాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి, లైసె న్స్ సస్పెండ్ చేయాలని రవాణా శాఖకు పంపుతున్నారు. అంతేకాదు, లైసెన్స్ రద్దు లో ఉన్నప్పుడు వాహనం నడుపుతూ దొరికితే జైలు శిక్ష కూడా పడే వీలుంది. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా వాహనదారుల్లో క్రమశిక్షణ పెంపొందించే కార్యక్రమాలు సైతం ఆర్టీఏ అధికారులు నిర్వహిస్తున్నారు.
రద్దు ప్రకియ ఇలా.
పోలీసుల నుంచి ఉల్లంఘనుల వివరాలు రవాణాశాఖకు చేరుతాయి. వారు పరిశీలించి సదరు వ్యక్తికి నోటీసులు పంపిస్తా రు. పది రోజుల్లో అతడు తన వివరణను ఆర్టీఏ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం, రవాణాశాఖ అధికారుల నిర్ణ యం మేరకు లైసెన్స్ రద్దు ప్రక్రియ జరుగుతుంది. కోర్టు నిబంధనల ప్రకారం, లైసెన్స్ రద్దు ప్రక్రియ ఉంటుంది.