Road Accident | పెద్దఅంబర్‌పేట, మే 4 : రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దఅంబర్‌పేట ఓఆర్ఆర్ సమీపంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా ఝరాసంగం మండలం ఏదులపల్లికి చెందిన బండి వినేశ్‌కుమార్ (30) ఆదివారం ఉదయం పెద్దఅంబర్‌పేట ఓఆర్ఆర్ రెండు బ్రిడ్జీల మధ్య విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిని దాటుతున్నాడు. అదే సమయంలో పుణె నుంచి ఒడిశాకు వెళ్తున్న లారీ ఓఆర్ఆర్ పైనుంచి కిందికి దిగుతూ హైవేపై వినేశ్కుమార్ను ఢీకొట్టింది. ప్రమాదంలో వినేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.