బుధవారం 28 అక్టోబర్ 2020
Rangareddy - Aug 14, 2020 , 23:41:31

వీధివ్యాపారులకు రుణాలు అందజేత..

 వీధివ్యాపారులకు రుణాలు అందజేత..

 దుండిగల్‌, గాజులరామారం: పీఎం స్వానిధికింద వీధివ్యాపారులకు అందిస్తున్న రుణాలను శుక్రవారం ఎమ్మెల్యే వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు లబ్ధిదారులకు అందజేశారు. గాజులరామారం డివిజన్‌ పరిధిలోని ముగ్గురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివేకానంద్‌, రుణాల మంజూరు పత్రాలను అందజేయగా, సూరా రం డివిజన్‌లోని 22 మంది వీధివ్యాపారులకు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అందజేశారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ మమత, సర్కిల్‌ ఉపకమిషనర్‌ రవీందర్‌కుమార్‌, ప్రాజెక్ట్‌ అధికారి హరిప్రియ, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, జగన్‌ కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు మురళి, ప్రసాద్‌, సురేశ్‌, ఇందిర తదితరులు పాల్గొన్నారు.logo