వికారాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో వికారాబాద్ మున్సిపల్ దశ దిశలు మారాయి. వికారాబాద్ మున్సి పల్లో గతంలో 28 వార్డులు ఉండేవి. వికారాబాద్ మండలంలోని ఆరు గ్రామాలు మున్సిపల్లో చేరి 34 వార్డులుగా మారడంతో పట్టణ పరిధి పెరిగింది. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డులలో ఏళ్ల తరబడి పేరుకపోయిన పలు సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరిం చింది. మొదటి విడత పట్టణ ప్రగతి 2019లో ప్రారంభమైంది. రెండో విడత 2020సంవత్సరం ఫిబ్రవరిలో రూ.56లక్షలు, మూడో విడత 2021వ సంవత్సరం జూలైలో రూ.36లక్షలు ఖర్చు చేశారు. నాలుగో విడత 2022వ సంవత్సరం మే లో రూ.34లక్షలు నిధులు విడుదల య్యాయి. రూ.1.26కోట్లు పట్టణ ప్రగతికి ప్రభుత్వం నిధులు మం జూరు చేసింది. ఇందులో భాగంగా మున్సిపల్ లోని అన్ని వార్డులలో శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చడం, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, తడి, పొడి చెత్తను వేరుయడం, ముళ్ల పొదలను, పెంట కుప్పలను తొలగించడం వంటి కార్యక్రమాలు జరిగాయి.
ప్రమాదకర బావులను పూడ్చడంతో పాటు పలు బావులపై జాలి వేశారు. పార్కు లను శుభ్రం చేయడంతో పాటు మొక్కలు నాటి పచ్చదనం పై శ్రద్ధ తీసుకున్నారు. వార్డులలో సమస్య తీవ్రతను బట్టి నిధులు ఖర్చు చేశారు. ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారులను నియమించి పట్టణ ప్రగతి పనులు జరిపించారు. హరిత హారంలో ఒకే సారి మొక్కలు నాటడంతో అవార్డులు వచ్చాయి. గత ప్రభుత్వంలో మంజూరైన రూ.60కోట్ల పను లకు టెండర్లు పూర్తి అయ్యాయి. వీటిని రోడ్లు, డ్రైనేజీ తదితర వాటి కోసం అభివృద్ధికి నోచుకోని వార్డులలో ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. మున్సిపల్లోని 34 వార్డులు ఉండగా… కొత్తగా మన్సిపల్లో కలిసిన ఆరు వార్డులు బూర్గుపల్లి, గుడుపల్లి, గెరిగెట్పల్లి, కొంపల్లి, దన్నారం, మద్గుల్ చిట్టంపల్లిలో అధికంగా నిధులు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
వికారాబాద్ శివసాగర్ చెరువులో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అప్పట్లో వికా రాబాద్ మున్సిపల్ పరిధిలోని శివసాగర్ చెరువు బౌండరీని సర్వే చేయించి పరిశీలించారు. అప్పటి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌ల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికా రులు శివసాగర్ చెరువు మినీ ట్యాంక్ బండ్ బౌండరీని సర్వే చేశారు. శివసాగర్ చెరువు మినీ ట్యాంక్ బండ్‌గా సుందరంగా తీర్చిదిద్దేందుకు పనులు జరిగాయి. పార్కులు, మినీ ట్యాంక్ బండ్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశ పడ్డారు. అప్పట్లో టీఎఫ్ఐడీసీ నిధులు రూ.10 కోట్లుకూడా మంజూరు అయ్యాయి. కాని ఆ పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఆ నిధులను మళ్లించి వికారాబాద్ మున్సిపల్లోని ఆయా వార్డులలో సీసీ రోడ్ల పనులు జరిగాయి.
రైతుల సమస్యలు పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వికారాబా ద్లో ఇంటిగ్రేటెడ్ (వెజ్అండ్నాన్వెజ్) మార్కెట్ ఏర్పాటుకు పూను కుంది. 2021లో వికారాబాద్ పట్టణంలోని రైతు బజార్ సమీపంలో 105 సర్వే నెంబర్లో రెండు ఎకరాల స్థలాన్ని మార్కెట్ నిర్మాణానికి కేటాయించింది. అందుకు అవసరమైన రూ.7.20కోట్ల నిధులను సైతం మంజూరు చేసింది. అందులో 108 స్టాళ్లను ఏర్పాటు చేసేం దుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పనులు ప్రారంభం అయ్యాయి. పునాదులు పడ్డాయి. పిల్లర్లు, బేస్మెట్ వరకు పనులు జరిగాయి. అంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇంటిగ్రేడెట్ మార్కెట్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రైల్వే బ్రిడ్జి 900 మీటర్లు ఉంది. రోడ్డుకు ఇరువైపుల ఫుట్‌పాత్‌లతో కలిసి 36ఫీట్ల వెడల్పుతో రోడ్డును గతంలో నిర్మించారు. చాలా రోజులు కావడంతో బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి రూ. 96 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి ఆర్అండ్బీ అధికారులు తగు ప్రణాళికలు తయారు చేశారు. ప్రస్తుతం బ్రిడ్జీ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్లకు యంత్రాల సహాయంతో గుంతలు తీస్తు న్నారు. పాత బ్రిడ్జి పక్కనే నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమ య్యాయి. 900 మీటర్ల బ్రిడ్జినిర్మాణానికి ప్రభుత్వం నిధులు మం జూరు చేసింది. 25ఫీట్ల రోడ్డుతో పాటు బ్రిడ్జికి ఒక వైపు ఆరు ఫీట్లతో ఫుట్‌పాత్ ఏర్పాటు చేయనున్నారు. బ్రిడ్జి నిర్మాణం ఒకటిన్నర సంవ త్సరంలోనే పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేకపోవడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఉన్న అండర్ డ్రైనేజీ కలెక్షన్ ఆలంపల్లిలోని మురుగు నీటి శుద్ధి కేంద్రం వరకు ఉంది. ఆయా వార్డుల నుంచి వచ్చిన వ్యర్థాలు అంతా మురుగు నీటి శుద్ధి కేంద్రం లోకి చేరుతాయి. అక్కడ మురుగును శుద్ధి చేసి నీటిని పక్కనే ఉన్న మూసి నదిలోకి వెళ్లడంతో మూసి నది కలిషితం కాకుండా ఉండేది. పది సంవత్సరాలకు పైగా ఈ పనులు బాగానే జరిగాయి. గత రెండు సంవత్సరాల నుంచే మురుగు నీటి శుద్ధి కేంద్రంలో మిషన్లు ఒక్కొ క్క టిగా పాడవుతున్నాయి. వాటికి సరైన సమయంలో మరమ్మతులు చేయలేక పోవడంతో పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం మరుగు నీరు శుద్ధి కాకపోవడంతో మున్సిపల్ అధికారులు నేరుగా మురుగు నీటిని మూసి నదిలోకి వదులుతున్నారు. మూసి నది అంతా కలిషితం అవుతుంది. మురుగు నీటి శుద్ధి కేంద్రం మరమ్మతుల కోసం నిధులు కావాలని సంవత్సరంకు పైగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఎట్టకేళ్లకు కొన్ని రోజుల క్రితం రూ. కోటి మంజూరు అయ్యాయి. వాటిని కూడా వెంటనే పనులు చేపట్టకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు.