నందిగామ, అక్టోబర్ 24 : బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి, నాయకులు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. పార్టీలో కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలన్నారు. నెల రోజుల పాటు కష్టపడి పని చేస్తే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ తగిన విధంగా గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షురాలు కట్న లత, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, సర్పంచ్‌లు నర్సింహులు, గోవిందు అశోక్, జట్ట కుమార్, కో ఆప్షన్ మెంబర్ బేగ్, నాయకులు శ్రీశైలం, బంటారం సుదర్శన్‌గౌడ్, జంగిలి కుమార్, రజినీకాంత్‌గౌడ్, సములయ్య, ఆంజనేయులు, పాండు, రమేశ్, నర్సింహ, మల్లేశ్, పాషా, విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.