షాబాద్, జూన్ 4 : రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని రుద్రారం, కొమరబండ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో పాల్గొని అధికారులతో కలిసి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భూ భారతి చట్టం ద్వారా పెండింగ్‌లో ఉన్న రైతుల భూ సమస్యలు పరిష్కారం కానున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఏండీ అన్వర్, డిప్యూటీ తహసీల్దార్ మధు, సీఐ కాంతారెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, మాజీ చైర్మన్ బండ మహేందర్‌గౌడ్, గ్రామస్తులు యాదిరెడ్డి, సంజీవరెడ్డి, వేణుగోపాల్, బందయ్య, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.