Hyderabad Metro | సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగా ణ): పాతనగరంలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మిస్తున్న మె ట్రో మార్గం కోసం భూసేకరణ వేగంగా జరుగుతున్నదని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఎంజీబీఎస్ వరకు ఉన్న మార్గాన్ని పాతనగరం మీదుగా చాం ద్రాయణగుట్ట వరకు సుమారు 7.5 కి.మీ మేర నిర్మిస్తున్నామని, ఇందు కోసం సుమారు 1200 ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని చెప్పారు. భూసేకరణ చట్టం -2013 కింద 400 ఆస్తులకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు.
వివిధ పత్రికల్లోనూ ఇం దుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చి ఆస్తులను సేకరించే ప్రక్రియను వేగవం తం చేశామన్నారు. జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ జరుగుతున్నదన్నారు. అదేవిధంగా మెట్రో స్టేషన్లు నిర్మించే ప్రాం తాల్లో మాత్రం రోడ్డు 120 అడుగుల వెడల్పుతో విస్తరణ చేపట్టాల్సి ఉంటుందని ఎన్వీఎస్రెడ్డి తెలిపారు.
దారుల్ షిపా జంక్షన్ నుంచి శాలిబండ వరకు ప్రస్తుతం రోడ్డు వెడల్పు 50 అడుగుల నుంచి 60 అడుగుల వరకు, శాలిబండ జంక్షన్ నుం చి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 80 అడుగులు ఉందన్నారు. అందువల్ల దారుల్‌షిపా-శాలిబండల మధ్య చాలా ఆస్తుల విషయంలో ఒక్కొక్కటీ 20-25 అడుగుల చొప్పున విస్తరణ చేయాల్సి ఉంటుందని, అలాగే శాలిబండ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఒక్కో ఆస్తిని 10 అడుగుల వరకు విస్తరణ చేయాల్సి ఉంటుంద ని వివరించారు. మెట్రో స్టేషన్లు, వంపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్తుల విషయంలో మాత్రం రహదారి విస్తరణ కాస్తా ఎక్కువగా ఉంటుందన్నారు.
సంప్రదాయంగా వస్తున్న సర్వే పద్ధతుల తోపాటు 3డీలో వీక్షించేలా లైడార్ డ్రైన్ సర్వే సైతం చేసినట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. దీనివల్ల ప్రభావితమయ్యే ఆస్తుల తోపాటు చుట్టు పక్కల ఉన్న ఆస్తులను కూడా వీక్షించవచ్చన్నారు. ప్రభావిత నిర్మాణాల విలువను అంచనా వేసేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఇంజినీర్లు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. 7.5 కి.మీ మేర నిర్మించే మెట్రో కారిడార్‌లో 103 మతపరమైన, సున్నితమైన కట్టడాలు ఉన్నాయ ని, వాటి పరిరక్షణ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. భూసేకరణ చట్టం అనుసరించి చేపడుతున్న ఈ భూసేకరణ కార్యక్రమం 8 నెలల్లో పూర్తి కావచ్చని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
మెట్రో కార్యకలాపాలపై ప్రయాణికుల గరం గరం.. ‘సురక్షిత ప్రయాణం ఏందో ఏమో గానీ… జర్నీ మాత్రం కాస్ట్లీగా మారింది. రద్దీ అనుగుణంగా కోచ్‌లను పెంచరు. కానీ మెట్రో పార్కింగ్ పేరుతో భారీగా వసూళ్లకు తెగబడుతున్నారు. నిల్చుందామంటే స్థలం ఉండదు. మెట్రో రైలు ఎక్కే సమయంలోనూ తోసుకుంటూ ఎక్కాల్సి వస్తోంది..’ అంటూ మెట్రో కార్యకలాపాలపై ప్రయాణికులు గరం గరం అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మెట్రో సేవలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆగస్టు 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన పెయిడ్ పార్కింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంలో రాకపోకలకు ఎంతో అనువుగా ఉంటుందని లక్షలాది మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. తమ ద్విచక్ర వాహనాలను మెట్రో స్టేషన్ల దగ్గర ఉచితంగా ఏర్పాటు చేసిన స్థలంలో పార్కింగ్ చేసి..నిత్యం మెట్రో రైలు రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి వారికి షాకింగ్ ఇస్తూ ఆగస్టు 25 నుంచి పార్కింగ్ ఫీజులను వసూలు చేస్తామంటూ ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఆగ్రహిస్తున్నా రు. ఈనెల 14న మెట్రో స్టేషన్లో ఆందోళనకు దిగిన ప్ర యాణికులు, మరోసారి ఈనెల 25న మహాధర్నాను నిర్వహిం చనున్నట్లు సమాచారం.