ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 15 : బీఆర్ఎస్ యువజన నాయకుడు, పార్టీ స్పోక్స్‌పర్సన్ కర్నె అరవింద్ మృతి బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గత ఆదివారం గుండెపోటుతో అరవింద్ మృతిచెందిన విషయం తెలుసుకుని వారు వేర్వేరుగా బుధవారం ఇబ్రహీంపట్నంలోని అరవింద్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ముందుగా అరవింద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..చిన్న వయసులోనే పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారని..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో ముందుకెళ్తున్న అతడి మృతి బాధాకరమన్నారు. అరవింద్ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పార్టీకోసం అనుక్షణం పాటుపడే అరవింద్ మృతి బీఆర్ఎస్కు తీరని లోటన్నారు.
వారితోపాటు బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, క్యామ మల్లేశ్, సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్లు బుగ్గరాములు, ప్రవీణ్, గిరి, త్రిలోక్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు రాజు, జగదీశ్వర్, గోపాల్‌గౌడ్, శివసాయి, ఏనుగు భరత్‌రెడ్డి, రాంబాబు, రాజేశ్, బద్రీనాథ్, బొట్టు, సీహెచ్ రమేశ్, కే రమేశ్‌గౌడ్, బహదూర్, శేఖర్, రఘుపతి, జలంధర్, గణేశ్, వీరేశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.