తుర్కయంజాల్, జూలై 14 : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య అన్నారు. సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీసీసీబీ చైర్మన్ సత్తయ్య మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డితో కలిసి మొక్కలను నాటారు.
అనంతరం అయన మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతో దోహదపడుతాయన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రాం రెడ్డి, మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ మంగమ్మ, అయ్యప్ప దేవస్థానం కమిటీ సభ్యులు నర్సింహ, అశోక్ గౌడ్, శ్రవణ్ గౌడ్, వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.