మాదాపూర్, ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ) 9: కేరళ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ మాస్టర్స్ పోటీల్లో పథకాలు సాధించిన విజేతలను(National Masters Competition) తెలంగాణ సంయుక్త కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ అధ్యడు కొండ విజయ్ కుమార్ అభినందించారు. చందానగర్ హుడాకాలనీలో ఆదివారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పథకాలు సాదించిన వారిని అభినందిస్తూ రానున్న పోటీల్లో మరిన్ని పథకాలు సాధించేందుకు స్టేడియాలలో శిక్షణ అందిస్తామని తెలంగాణ సంయుక్త కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్యక్షుడు కొండ విజయ్ తెలిపారు.
పీజేఆర్ స్టేడియం తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందిన అజయ్ కుమార్ , రామారావు, ఏసురత్నం, నాగలక్ష్మి, స్వాతి, మానసపతి, శివలీలరెడ్డి, స్వాతి గౌడ్ , జయలక్ష్మి, మల్లేశ్వరి, శైలజ, భవాని తదితరులు పథకాలు సాధించిన వారిలో ఉన్నారు. ఇందులో భాగంగా మొత్తం 21 పథకాలు రాగా, 7 బంగారు, 7 రజత, 7 కాంస్య పథకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్ , ట్రెజరర్ స్వాతి తో పాటు మాస్టర్స్ పాల్గొన్నారు.