కొడంగల్ : ఈటీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న ఢీ13 సీజన్లో మండలంలోని టేకల్‌కోడ్ గ్రామానికి చెందిన మహేశ్ కూతురు కావ్యశ్రీని శుక్రవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సన్మానించి అభినందించారు. ఢీ13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ డాన్స్ పోటీలో మండలానికి చెందిన కావ్యశ్రీ విజేతగా నిలువడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. డాన్స్ పోటీల్లో మరింత స్థాయి ఖ్యాతి సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్‌కుమార్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.