IND vs WI : సిరీస్‌లో నిలవాలంటే గెలవకతప్పని మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు దంచేశారు. గువాహటి వన్డేలో ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్(101) సెంచరీతో దడ పుట్టించగా.. కెప్టెన్ షాయ్ హోప్(104), అమిర్ జంగూ(100 నాటౌట్)లు సైతం భారత బౌలర్లపై విరుచుకుపడి సెంచరీలు సాధించారు. ఈ ముగ్గురి శతకంతో విండీస్ స్కోర్ 38 ఓవర్లకే మూడొందలు దాటింది. మరో పది ఓవర్లు ఉండడంతో అలవోకగా నాలుగొందలు కొట్టేలా ఉంది పర్యాటక జట్టు.
రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు భారీ స్కోర్‌కు పునాది వేశారు. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్(101: 68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో రెచ్చిపోగా.. అనంతరం.. గువాహటిలో భారత బౌలర్లను కెప్టెన్ షాయ్ హోప్(104) జతగా అమిర్ జంగూ(100 నాటౌట్) ఆడుకున్నారు. సెంచరీ భాగస్వామ్యంతో పాటు చెరో శతకం బాదిన వీరు విండీస్ స్కోర్ బోర్డును ఉరికించారు. వన్డేల్లో హోప్ 20వ సెంచరీ నమోదు చేయగా.. జంగూ రెండోసారి వంద పూర్తి చేసుకున్నాడు.
Shai Hope and Amir Jangoo keep West Indies’ momentum going with tons in Guwahati 💪
📝: https://t.co/qGrCAE7B7s pic.twitter.com/Bs3q9iONE9
— ICC (@ICC) September 30, 2026
ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది ఆరోసారి. తొలుత 2015లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా నమోదు చేసింది. అదే ఏడాది భారత్‌పై సఫారీ బ్యాటర్లు ముగ్గురు వందతో విరుచుకుపడ్డారు. 2022లో నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు ముగ్గురు మూడు సెంచరీలు కొట్టారు. ఆపై 2023లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా, 2025లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా.. ఈసారి భారత్‌పై వెస్టిండీస్ బ్యాటర్లు ముగ్గురు తలొక శతకంతో రెచ్చిపోయారు.
Three 100s in a single innings in Men’s ODIs 👇#INDvWI pic.twitter.com/7ghT3niI7l
— Cricbuzz (@cricbuzz) September 30, 2026