కొడంగల్, డిసెంబర్ 1: కొడంగల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,36,625మంది ఓటర్లు కాగా, పురుషులు 96,403 మంది, స్త్రీలు 97,537మంది ఉన్నారు. మొత్తంగా 1.93, 940మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొగా 81.96శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన కొత్తపల్లి మండల కేం ద్రంలో అత్యధికంగా 94.69 శాతం, కోస్గి పట్టణ కేంద్రంలో అత్యల్పంగా 60.02శాతం పోలింగ్ నమోదైంది.
కొత్త ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. గతంలో పోలింగ్ కేంద్రాల్లో 10 గంటల తరువాత ఓటర్ల రద్దీ ఉండేదని, కానీ ఈ సారి ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరడం కనిపించింది. నియోజకవర్గంలోని బొంరాస్‌పేట మండలం తుంకిమెట, మద్దూర్ మం డలంలో పోలింగ్ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది.
మధ్యాహ్నం వీవీప్యాడ్లు మొరాయించడంతో ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడి ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం పరిగి పట్టణంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వస్థలాలకు చేరుకోవడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఓటర్లు తిరుగు ప్రయాణమయ్యారు.
పరిగి, డిసెంబర్ 1: పరిగి నియోజకవర్గంలో 76.70శాతం పోలింగ్ జరిగింది. నియో జకవ ర్గంలో మొత్తం ఓటర్లు 2,59,422 మంది ఉండగా వారి లో పురుషులు 1,31,163 మంది, మహిళలు 1,28,250 మంది, ఇతరులు 9 మంది ఉన్నారు. గురు వారం జరిగిన పోలింగ్ సందర్భంగా పురుషులు 1,00,519 మంది, మహిళలు 98,466 మంది, ఇతరులు ఒకరు, మొత్తం 1,98,986 (76. 70శాతం) మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు పోలింగ్ సమయం ఉండగా కొన్నిచోట్ల రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది.