యాచారం, అక్టోబర్ 16 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల దిమ్మతిరుగుతున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో కొట్టుకుపోయాయన్నారు. రైతుబంధు రూ.16 వేలు, ఆసరా పింఛన్ రూ.5016, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా, రూ.400లకే గ్యాస్ సిలిండర్, జర్నలిస్టులకు వైద్య బీమా, ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ కమిటీ, పేద మహిళలకు నెలకు రూ.3 వేలతో పేద ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ మ్యానిఫెస్టోను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ కేటాయించాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. బీజేపీలో టికెట్ ఎవరికివ్వాలో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. గతంలో మాదిరిగా ఈ సారి కూడా బీఆర్ఎస్కు మండలం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. మండలంలో ఏర్పాటు చేసుకున్న 59 బూత్‌ల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, బూత్ సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, ఇందిర, హబీబుద్దీన్, సంతోష, కృష్ణ. ఎంపీటీసీ రవికిరణ్‌రెడ్డి, ఇస్రత్బేగం, పార్టీ ప్రధాన కార్యదర్శి బాషా, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, డైరెక్టర్లు మక్కపల్లి స్వరూప, శశికళ, నరేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తలారి మల్లేశ్, శంకర్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు బిలకంటి శేఖర్‌రెడ్డి, జక్క రాంరెడ్డి, యాదయ్యగౌడ్, మహ్మద్ ఖాజా, గోపాల్, శివ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : ఇబ్రహీంపట్నం గడ్డ రాజకీయంగా చైతన్యం ఉన్న గడ్డ అని, ఇక్కడి ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ బూత్ కన్వీనర్ల సమావేశం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడలోని జేఎంఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్ ఆదిబట్ల మున్సిపాలిటీ అధ్యక్షడు జంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటికే రూ.2931 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రకటించిన సంక్షేమ పథకాలే కాకుండా అనేక పథకాలను ప్రజలకు అందించారని అన్నారు. మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేయగల సత్తా ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, అలాంటి నాయకుడే తిరిగి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. బీ ఫామ్‌తో వచ్చానని, గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జక్కా రాంరెడ్డి, ఆదిబట్ల మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యుడు గోపాల్ గౌడ్, నాయకులు జంగయ్య, మహేందర్, కృష్ణంరాజు, సుధాకర్, రసూల్, సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.