షాబాద్, జూన్ 1 : రంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జోరుగా సాగుతున్నది. గ్రా మాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు ప్రజలు అధికంగా తరలివచ్చి .. కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.. వైద్యులు అవసరమైన వారికి కంటి అద్దాలతోపాటు మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కాగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో మొత్తం 80 బృందాల ద్వా రా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో గురువారం 10,411 మందికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 513 మందికి అద్దాలు అందజేశారు. 593 మంది కోసం ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు సక్సెస్ఫుల్గా సాగుతున్నాయి. గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజ లు ఉత్సాహంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. గురువారం జిల్లాలో 3,552 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 385 మం దికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. 391 మంది కోసం వై ద్యులు ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉం డగా జిల్లాలో ఇప్పటివరకు 532 గ్రామాలు, 97 వార్డు ల్లో కంటి శిబిరాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.