CM KCR | ‘తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతం.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారు.. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలొళ్ల వరకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి.. ఇలాంటి పథకాలు మాకూ కావాలి..’ అని అంటున్నారు కర్ణాటకవాసులు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ర్టానికి చెందిన మెతుకు, మెతుకుతండా, సిలార్ కోట్రిక గ్రామాల ప్రజలు తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను కండ్లారా చూస్తూ సీఎం కేసీఆర్ పాలనను మెచ్చుకుంటున్నారు. కల్యాణలక్ష్మితో ఆడబిడ్డల పెండ్లికి భరోసా, రైతుబంధుతో పెట్టుబడి సాయం, ఆపదలో ఆదుకునే రైతుబీమా, ఊరూరా ‘పల్లె ప్రగతి’ పనులు ఎంతో బాగున్నాయంటున్నారు. తమ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, ఆయన హయాంలోనే దేశాభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
కొడంగల్/బొంరాస్పేట, ఏప్రిల్ 10 : తెలంగాణలో సంక్షేమ పాలన సాగుతున్నదని.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని కొడంగల్ నియోజకవర్గానికి సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి జిల్లా సేడం నియోజకవర్గంలోని మెతుకు, మెతుకుతండా, సిలార్ కోట్రిక గ్రామాల్లోని పలువురు రైతులు, ప్రజలు, యువకులు పేర్కొంటున్నారు. తెలంగాణలో 24 గంటల కరెం టు, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్, దళితబంధు, ఆసరా పింఛన్లు, సాగునీటి కాలువలు, పచ్చని పంటపొలాలు, సకల వసతు లు, అన్ని వర్గాలకు సం క్షేమ పథకా లు సక్రమంగా అందుతుంటే… ప్రజా సంక్షేమం పట్టని తమ కర్ణాటక పాలకులతో విసుగెత్తి పోతున్నామని వారు పేర్కొంటున్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మాకూ కావాలని.. అందుకోసం తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని అభిప్రాయపడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరాతో తెలంగాణ రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని.. పండించిన పంటలకు గిట్టుబా టు ధరలు పొందుతున్నారన్నారు. తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని.. బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ మాడల్ పాలన అమలై దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. బీజేపీకి బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని.. సీఎం కేసీఆర్ పాలన, రాజకీయ అనుభవం దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం తెలంగాణలా ఉండాలని ప్రశంసిస్తున్నారు.

Karnataka Telangana Border
తెలంగాణకు అనుకునే మా గ్రామాలున్నాయి. తెలంగాణ-కర్ణాటక బార్డర్లో కోట్రికె ఉంది. రోడ్డు అవతల తెలంగాణ భూములు, రోడ్డు ఇవతల కర్ణాటక భూములున్నాయి. మాకు హైదరాబాద్-బిజాపూర్ రోడ్డు మాత్రమే అ డ్డు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి సంతోషపడుతున్నాం. మేము వాటిని అందుకోలేక పోతున్నామనే బాధ మాత్రం ఉన్నది. సరిహద్దుకు దగ్గరగా ఉన్న మా గ్రామాలకు తెలంగాణలో కలుపుకొంటే బాగుండేది. మేము కూడా ప్రభుత్వ పథకాలను పొందేది.
– బస్వరాజ్, యువకుడు, సిలార్ కోట్రికె
తెలంగాణ మాదిరిగా కర్ణాటకలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వరు.. పోస్టులను నింపారు. కాబట్టి ఎంత చదువుకున్నా వ్యాపారం లేదా వ్యవసాయం చేసుకోవాల్సిందే. కర్ణాటకలో చాలావరకు వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబాలే ఎక్కువ. తెలంగాణలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మాకూ ఆ పథకాలు అమలైతే చాలా మంచిగా ఉండు.
– రవి, మెకానికల్ డిప్లొమా, మెదక్, కర్ణాటక
తెలంగాణలో మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ మంచి మంచి పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆడపిల్ల పుడితే రూ. 13 వేలతోపాటు కేసీఆర్ కిట్ అం దించి ఆదుకుంటున్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రసవం అనంతం తల్లీబిడ్డను పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా ఇంటి వద్ద దింపుతున్నారు.
– అనురాధ, మెదక్ గేట్, కర్ణాటక

సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వ్యవసా యం చేసుకుని బతుకుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు చాలా బాగున్నాయి. రైతుబంధుతో పెట్టుబడి సాయం సకాలంలో అందటంతో వారికి పెట్టుబడి ఖర్చుల్లేవు. అంతేకాకుండా పం ట చేతికి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న ది.
– ఆశప్ప, రైతు, సిలార్ కోట్రికె, కర్ణాటక
కర్ణాటకలో వృద్ధులకు నెలకు రూ.600 పింఛన్ మాత్రమే వస్తున్నది. అదే తెలంగాణలో ప్రతినెలా రూ.2016 చెల్లిస్తూ సీఎం కేసీఆర్ వారికి అండగా నిలుస్తున్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3016 పింఛన్ ఇస్తున్నాడు. ఎలాంటి ఆధారం లేని వారికి ఈ పింఛన్ ఎంతో ఆసరాగా నిలుస్తున్నది.
– ఊషప్ప, రైతు సిలార్ కోట్రికె, కర్ణాటక