దోమ : కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకం పేదింటి తల్లిదండ్రులకు భరోసాను కల్పించిందని ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం దోమ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 22మంది లబ్ధిదారులకు రూ. 22.2552 లక్షల విలువగల కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కులను జడ్పీటీసీ నాగిరెడ్డితో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి తల్లిదండ్రులకు తమ ఆడబిడ్డల పెళ్లిలు చేయగలమనే భరోసాను సీఎం కేసీఆర్ కల్పించారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం తీసుకురానన్ని పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు.
అనంతరం జడ్పీటీసీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకం పేదల పథకాలని తెలుపుతూ కరోనా వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, వైస్‌ఎంపీపీ మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, కోఆప్షన్ ఖాజాపాషా, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్యగౌడ్, ఎంపీటీసీలు దామోదర్‌రెడ్డి, నవాజ్‌రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఆర్ఐ లింగం, సర్పంచులు పాల్గొన్నారు.