షాబాద్, నవంబర్ 18: ఎన్నికల్లో ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం షాబాద్ మండలంలోని బొబ్బిలిగామ, కొమరబండ, గొల్లూరుగూడ, కేశవగూడ, ముద్దెంగూడ, ఎల్గొండగూడ, చర్లగూడ, మల్లారెడ్డిగూడ గ్రామాల్లో జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఢిల్లీ లీడర్లు తెలంగాణపై పెత్తనం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. 14ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని, మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తానని తెలిపారు.
జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ…గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు ్రబ్రహ్మరథం పడుతున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ ఏదో రకంగా ప్రభుత్వ పథకాలు అందించినట్లు తెలిపారు. అభివృద్ధి చేశాము…ధైర్యంగా ప్రజలను ఓటు అడుగుతామని చెప్పారు. కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించేందుకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు నర్సింగ్‌రావు, చల్లా శ్రీరాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నక్క శ్రీనివాస్‌గౌడ్, శేరిగూడెం వెంకటయ్య, నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు దేశమళ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు పీసరి సతీశ్‌రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, డైరెక్టర్లు పర్వేద నర్సింహులు, సూద యాదయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు దండు అర్చన, ఏశాల చంద్రశేఖర్, పగుడాల నర్సింహారెడ్డి, కుర్వ జయమ్మ, కవిత, కౌకుంట్ల పుష్పమ్మ, చందిప్ప జంగయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, ఎంపీటీసీ మధుకర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : కారుగుర్తుకు ఓటు వేసి అంజన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తే షాద్‌నగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరిగిందని మాజీ జడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి అన్నారు. చేవెళ్ల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా అజీజ్‌నగర్ క్లస్టర్ ఇన్చార్జీలు శ్రీహరియాదవ్, బద్దుల సుధాకర్‌యాదవ్ ఆధ్వర్యంలో అజీజ్‌నగర్ గ్రామంలో ఇం టింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కొత్త నర్సింహారెడ్డి, ఎం రవియాదవ్, మాజీ ఎంపీటీసీ మాణిక్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రాజు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ అధ్యక్షుడు డేవిడ్, సీనియర్ నాయకులు చెన్నారెడ్డి, శ్రీశైలం, రాజు, చంద్రయ్య పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలె యాదయ్య తరఫున సాయిరెడ్డిగూడ, గుండాల, లక్ష్మీగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, ఎంపీపీ విజయలక్ష్మి, పార్టీ నాయకులతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ ప్రసాద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యద్శర్శి నరేందర్ గౌడ్, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జు రెడ్డి, అంతారం సర్పంచ్ సులోచన, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఫయాస్, నరేందర్, నాయకులు మద్దెల జంగయ్య, విఠల్‌రెడ్డి, సాయినాథ్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : షాద్‌నగర్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే కారుగుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. 27వ వార్డులో నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లను కోరారు. నిరంతరం అభివృద్ధికి పాటుపడే బీఆర్ఎస్ పక్షాన నిలిచి కారుగుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు జూపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కేశంపేట : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వచ్చే కొత్త సంక్షేమ పథకాలు వస్తాయని, నిరుపేదలకు కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నందిగామ : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు మద్దతుగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను గెలిపించాలని కోరుతున్నారు. నందిగామలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ వెంకట్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.
కొత్తూరు : అంజయ్యయాదవ్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాతుక దేవేందర్‌యాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలోని కుమ్మరిగూడలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రూ. 110 కోట్లుతో కొత్తూరు మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీకి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారం ఎంతో అవసరం అని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ డోలి రవీందర్, నాయకులు జనార్దనాచారి, జె. శ్రీనివాసులు, గోపాల్‌గౌడ్, ఆంజనేయులుగౌడ్, శ్రీనివాస్‌చారి, కుమ్మరిగూడ ఆంజనేయులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : మరింత ప్రగతి కోసం కారు గుర్తుకు ఓటు వేసి మరో మారు ఎమ్మెల్యేగా కాలె యాదయ్యను గెలిపించాలని మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఘనీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు అన్నారు. ఇంటింటికీ తిరిగి పార్టీ మ్యానిఫెస్టోను వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని మండల కేంద్రంలోని ఆయా కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాయికుమార్, కృష్ణ, సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణా రెడ్డి, రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.