ఎల్బీనగర్, అక్టోబర్ 19 : షెడ్యుల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడుగా కె.బాలకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత షెడ్యుల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం హైపవర్ కమిటీ చైర్మన్ డి బాబయ్య జాతీయ అధ్యక్షుడిగా కె.బాలకృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ కార్యవర్గం నూతన కమిటీని జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్నుకున్నారు. షెడ్యుల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం సలహాదారులుగా జి. శంకర్, ఆర్. అంజయ్య, కె.డి. రమేష్, గౌరవాధ్యక్షులుగా మాస్టర్జీ, రాజు వస్తాద్, అధ్యక్షుడుగా కె. బాలకృష్ణ, వర్కింగ్ ప్రసిడెంట్స్గా ఎస్. గంగాధర్, పులి మోహన్, ఎ. దర్గయ్య, సెక్రటరీ జనరల్ రాయల్ నర్సింగ్‌రావు, ప్రధాన కార్యదర్శులుగా పి. జనార్థనం, బి. ప్రమోద్‌కుమార్, ఉపాధ్యక్షులుగా బిట్ల వెంకటేశ్వర్లు, పచ్చ శ్రీనివాసులు, ఎ.నర్సింగ్‌రావు, ఆస శ్రీరాములు, డి. మనుస్వామి, కార్యదర్శులుగా వై. బాలరాజు, పి. బల్వంత్, పాలడుగు శ్రీనివాస్‌లు ఎన్నికయ్యారు.
సంఘం సేవలో 40 ఏళ్లుగా విధులు
షెడ్యుల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘంలో వివిధ హోదాల్లో గత 40 సంవత్సరాలుగా సేవలు అందించిన కె. బాలకృష్ణ జాతీయ స్థాయిలో సంఘం అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యుల్డ్ కులాల హక్కుల పరిరక్షణకు చేస్తున్న పోరాటంతో మరింత కీలకమైన బాధ్యతలు లభించాయన్నారు. ఎల్లవేలలా ప్రజలకు సేవ చేయడంలోనే ముందుంటామని, షెడ్యుల్డ్ కులాల ఏ సమస్యలైన ముందుండి పోరాటం చేసి న్యాయం దక్కేలా చోరవ తీసుకుంటున్నామన్నారు. షెడ్యుల్డ్ కుమాల అభివృద్దితో పాటుగా ఆర్థిక, సామాజిక, సాంఘిక న్యాయం కోసం పాటు పడతాయనని అన్నారు.