వికారాబాద్/ధారూరు, డిసెంబర్ 15 : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. ఆదివారం ఆయన నివాసంలో వికారాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మల్లేశం, ఖలీల్, పాషా, ప్రవీణ్, మల్లేశం, మహేశ్‌కుమార్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్, ఫయాజ్, మహిపాల్‌రెడ్డి, అశోక్, మల్లేశ్, కావలి వెంకటేశ్, శ్రీనివాస్‌గౌడ్, హన్మంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.