పెద్దఅంబర్‌పేట, మే 15: పెద్దఅంబర్‌పేటలోని ఈదుల చెరువులో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈదుల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో చేపడుతున్న నిర్మాణాలను బుధవారం రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహకారంతో ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. చెరువుల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే సహించేదిలేదని హెచ్చరించారు.
కూల్చివేతల సమయంలో డీఈ ఉషారాణి, ఇరిగేషన్ ఏఈ తస్వీన్రాజా, మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టి, చెరువులో మట్టి నింపిన వారిపై హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.