మొదటిరోజు సజావుగా
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి. షాద్నగర్ పట్టణంలో 6 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు కొనసాగాయి. 1886 మంది సాధారణ విద్యార్థులకు 1779 మంది హాజరయ్యారు.
- ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు
- కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
షాద్నగర్టౌన్, ఫిబ్రవరి 29 : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి. షాద్నగర్ పట్టణంలో 6 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు కొనసాగాయి. 1886 మంది సాధారణ విద్యార్థులకు 1779 మంది హాజరయ్యారు. అదే విధంగా 490మంది ఒకేషనల్ విద్యార్థులకు 450 మంది హాజరయ్యారు. మొత్తం 147మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు గైర్హాజరైనట్లు కస్టోడియన్లు వీ. శ్రీకాంత్, చంద్రశేఖర్ తెలిపారు.
ఆమనగల్లు : ఆమనగల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు సజావుగా జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించారు. 375 విద్యార్థులకు 25 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సీఎస్ వెంకటయ్య తెలిపారు.
1197 మంది హాజరు
చేవెళ్లటౌన్ : చేవెళ్ల మండల కేంద్రంలో మొత్తం నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 1197 మంది విద్యార్థులకు 1131 మంది పరీక్షకు హాజరయ్యారని కస్టోడియన్ నరేశ్ కుమార్ తెలిపారు.
శంకర్పల్లి : చైతన్య కళాశాలలో 261 మంది విద్యార్థులకు 254 మంది, టీఎస్ మాడల్ కళాశాలలో 333 మంది విద్యార్థులకు 306 మంది, వాసవి ఒకేషనల్ కళాశాలలో 198 మంది విద్యార్థులకు 195 మంది, వివేకానంద కళాశాలలో 268 మందికి 255 మంది పరీక్షకు హాజరయ్యారు.
మొయినాబాద్ : మొదటి రోజు ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగాయి. బుధవారం ప్రారంభమైన పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. మండల పరిధిలోని హిమాయత్నగర్లోని ఎన్టీఆర్ కళాశాల, మొయినాబాద్ మండల కేంద్రంలోని సిద్దార్థ డిగ్రీ కళాశాల, చాలెంజర్ ఇంటర్ నేషనల్ కళాశాలతో పాటు చిలుకూరు రెవెన్యూలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలురు కళాశాలలో, పెద్దమంగళారం గ్రామ రెవెన్యూలో ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కళాశాలలో 293 మంది, సిద్ధార్థలో 253 మంది, చిలుకూరు గురుకుల కళాశాలలో 352 మంది, తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలలో 293 మంది, చాలెంజర్ కళాశాలలో 352 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1457 మంది హాజరైనట్లుగా అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

