షాద్‌నగర్, మే 2 : బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలన తీరుకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంగళవారం షాద్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో చౌదరిగూడ మండలం చింతకుంటతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
చందూనాయక్, గోపాల్‌నాయక్, చందర్‌నాయక్, వెంకట్‌నాయక్, పెంట్యా నాయక్, రాంచరణ్నాయక్, చందు, బిచ్యానాయక్లతో పాటు మరో 20 మందికి పార్టీ కండువాలను కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు పార్టీ బలోపేతానికి మరింత కృషిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని లంబాడా గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసింది సీఎం కేసీఆర్ అనే విషయాన్ని గిరిజనులు గ్రహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.