TGTWREIS | కొడంగల్, జూన్ 06 : రంగారెడ్డి – హైదరాబాద్ రీజియన్ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం నందు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను కొడంగల్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బీపీసీ గ్రూపులలో ప్రవేశము కొరకు అడ్మిషన్స్ జరుగుతున్నట్లు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన గిరిజన బాలురకు ఈనెల 10వ తేదీన ఉదయం 11.00 గంటలకు TGTWREIS పాత కొడంగల్, చెరువు కట్ట దగ్గర గల కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు బదిలీ ధృవీకరణ పత్రము, పదిలో సాధించిన మార్కుల మెమో, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రాలు వెంట తీసుకురావాల్సి ఉంటుందని వివరించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఖాళీగా ఉన్న సీట్ల యందు ప్రవేశం పొందగోరే బాలురు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గిరిజన విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఫోన్ నెంబర్ 8333925370 సంప్రదించాలని సూచించారు.