కేశంపేట, జులై 28 : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో దాత గోపని భీమన్న సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం అమర్చారు. ఈ సందర్భంగా గోపని భీమన్న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సీసీ కెమెరాలవల్ల అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు సమయపాలన పాటించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కెమెరాలు ఉన్నాయన్న ఉద్దేశంతో విద్యార్థులు అప్రమత్తంగా మసులుకుంటారని తెలిపారు. ఉత్తమ క్రమశిక్షణ పెంపొందేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యుడు రాజవర్ధన్‌రెడ్డి, కానిస్టేబుల్ అశోక్‌రెడ్డి, గ్రామస్తులు శ్రీశైలం, కె.రాములు, రవీందర్‌గౌడ్, పర్వతాలు, రవీందర్‌గౌడ్, మల్లేశ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.