భూముల వేలం
ఖజానా ఖాళీ అయ్యిందో ..లేక పాలకుల ధనదాహం పెరిగిందో తెలియదు కానీ.. ప్రభుత్వ భూములన్నీ మం చు కొండల్లా కరిగిపోతున్నాయి. అడ్డగోలుగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవడ మే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన సాగుతు న్నది. తాజాగా రాయదుర్గం పాన్‌మక్తా పరిధిలోని టీజీఐఐసీ భూముల వేలంలో ఎకరాకు ఏకంగా రూ.237 కోట్ల రికార్డు ధర పలకడంతో సర్కారు అత్యాశ మ రింత పెరిగింది.
- రాయదుర్గం తరహాలో ఆదాయం రావాల్సిందే
- టీజీఐఐసీ భూములతో హెచ్ఎండీఏ ప్లాట్లకు లంకె
సిటీబ్యూరో : ఖజానా ఖాళీ అయ్యిందో ..లేక పాలకుల ధనదాహం పెరిగిందో తెలియదు కానీ.. ప్రభుత్వ భూములన్నీ మం చు కొండల్లా కరిగిపోతున్నాయి. అడ్డగోలుగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవడ మే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన సాగుతు న్నది. తాజాగా రాయదుర్గం పాన్‌మక్తా పరిధిలోని టీజీఐఐసీ భూముల వేలంలో ఎకరాకు ఏకంగా రూ.237 కోట్ల రికార్డు ధర పలకడంతో సర్కారు అత్యాశ మ రింత పెరిగింది. అదే ఊపుతో జూన్ 17న జరిగే హెచ్ఎండీఏ భూముల వేలంలో నూ రూ.కోట్ల ఆదాయం రావాలని అధికారులకు సర్కారు సూచనలు జారీ చేసిం ది.
టీజీఐఐసీ రేట్లను సాకుగా చూపి, హె చ్‌ఎండీఏ ప్లాట్లనూ విక్రయించి ఖజానా నింపుకోవాలని చూస్తున్నది. రాయదుర్గం ఏరియాలో కమర్షియల్ స్థలాలన్న డిమాండ్ వేరు..హెచ్ఎండీఏ పరిధిలో వివిధ లేఅవుట్లలో ఉండే నివాస, సెమీ కమర్షియల్ ప్లాట్ల మార్కెట్ విలువ వేరనే అంశాన్ని పక్కనపెట్టి.. భూముల ద్వారా రూ. వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతున్నది. నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న హెచ్ఎండీఏలో అభివృద్ధి పనులను పట్టాలెక్కించాలంటే భూముల విక్రయం ఒక్క టే మార్గంగా భావిస్తున్న సర్కారు, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా భారీ ఆదాయాన్ని లెక్కలు వేసుకుంటున్నది.
హెచ్ఎండీఏలో రూ.3,000కోట్లు..
రాయదుర్గంలోని ఎకరా రూ. 237 కో ట్లు పలికిందని, హెచ్ఎండీఏ భూముల వేలంలోనూ చదరపు గజానికి భారీగా ధరలు పెంచి ఆ రేంజ్‌లోనే ఆదాయం తేవాలని పైస్థాయి నుంచి ఆదేశాలు న్నా యి. అందుకే అప్సెట్ ధరను ఎకరం రూ. వంద కోట్లుగా నిర్ధారించింది. ఈనెల 17న జరిగే షేక్‌పేట మండలంలోని హకీంపేట్ పరిధిలోని సర్వేనం. 102/1 లోని 8.24గుంటల భూముల ద్వారా రూ.1500 కోట్లు రావాలని సర్కార్ లెక్క లు వేసుకుంటున్నది. ఇదే అధికారులను ఆందోళన కలిగిస్తున్నది. మార్కెట్‌ను మిం చి రేట్లు పెంచితే అసలు కొనేవారు కరువైపోతారనే విషయాన్ని మరిచిన సర్కారు.. కృత్రిమ ధరల పెంపుతో మార్కెట్‌ను గందరగోళంలో పడేస్తున్నది.
ఖజానా నిండాల్సిందే..
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి లే అవుట్ నుంచి గరిష్ఠ ఆదాయాన్ని ఎలా పిండుకోవాలనే లక్ష్యంతోనే సర్కారు పనిచేస్తున్నది. ఈ క్రమంలో నెల రోజుల వ్యవధిలోనే నిర్విరామంగా సాగుతున్న భూముల వేలంతో వచ్చే ఆదాయంపై ఆధారపడింది. ఈ వేలంపాటపై సర్కారు గంపెడాశలతో ఉండగా.. ఇప్పటికే నగరం లో రియల్ ఎస్టేట్ రంగం మందగించి ఉన్న తరుణంలో…ఈ తరహా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు వికటించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అం చనా వేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పక్కనపెట్టి, నగరంలో మౌలిక వసతుల కల్పన పేరిట భూములను విక్రయించడమే లక్ష్యంగా ఉన్న ప్రభుత్వ ధనదాహానికి ఈ నెలలో జరిగే భూముల వేలం ఉ దాహరణగా నిలుస్తుందని నగరవాసులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

