రంగారెడ్డి : సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.
జిల్లాలోని కొందుర్గ్ మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు సోమవారం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.
పార్టీలో చేరినవారిలో కాశ మహేష్, కాశ ప్రేమ్ కుమార్, విద్యాసాగర్, కృష్ణ, బుచ్చి రెడ్డి, మంగన్నగారి వెంకట్ రెడ్డి, బాలరాజు, కృష్ణ ప్రసాద్, సతీష్ కుమార్, ఉదయ్ కిరణ్, కంది రమేష్, రాజు, మహేష్, జగదీష్ చారి, రాజ్ కుమార్, ప్రవీణ్ కుమార్, మల్లేష్, నరేందర్ రెడ్డి, రాములు తదితరులు ఉన్నారు.