గిరిజనులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. చెంచులు, ఎస్టీల బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు వాటిలో ఉచితంగానే బోర్లు తవ్వించి మోటరుతోపాటు పైపులు, విద్యుత్తు సరఫరాను కల్పించాలనే ఉద్దేశంతో గిరి వికాసం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఐదు ఎకరాలకుపైగా భూములున్న గిరిజనులను మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఎంపిక చేసింది. అయితే ఈ పథకంలో భాగంగా జిల్లాకు ప్రభుత్వం రూ.2.88 కోట్లు విడుదల చేయగా.. ఇప్పటివరకు రూ.2.51 కోట్లను అధికారులు గిరిజన భూముల అభివృద్ధి కోసం ఖర్చు చేశారు.
జిల్లావ్యాప్తంగా 228 బ్లాక్‌లను గుర్తించి 1,474 ఎకరాలను గిరి వికాసం పథకం అమలుకోసం ప్రతిపాదనలు పంపగా.. 180 బ్లాక్ల్లోని 1,200 ఎకరాలకు మాత్రమే సర్వే ప్రక్రియ పూర్తైంది. ఇప్పటివరకు 107 బ్లాక్ల్లోని 747 ఎకరాలకు సంబంధించి 326 మంది గిరిజన రైతుల భూముల్లో బోర్లు వేయించి.. మోటర్లు బిగించి, విద్యుత్తు సరఫరా కల్పించి అధికారులు సాగుకు యోగ్యంగా మార్చారు. కాగా జిల్లాలో ఎంపిక చేసిన బ్లాక్ల్లోని గిరిజనుల భూములను సాగులోకి తెచ్చేందుకు వారు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు 1,20,652 మంది ఉన్నారు. ఈ పథకంలో రూపాయీ ఖర్చు లేకుండానే బీడు భూములు సాగులోకి వస్తుండడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– వికారాబాద్, డిసెంబర్ 18, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గిరిజన తెగలకు చెందిన ఎస్టీ, చెంచులను ఆర్థికం గా బలోపేతం చేయడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టారు. ఇప్ప టికే గిరిజనుల సంక్షేమానికి ఎన్నో రకాల ప్రభు త్వ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వారి భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు గత ప్ర భుత్వం గిరిజనుల బీడు భూముల్లో బోర్లు త వ్వించి బోరు మోటరుతోపాటు విద్యుత్తు లైన్ వే సి వాటిని సాగుకు యోగ్యంగా మార్చాలనే ఉద్దే శంతో గిరి వికాసం పథకాన్ని అమల్లోకి తీసుకొ చ్చింది.
బోరు తవ్వించడంతోపాటు బోరు మోట రు, పైపులు, విద్యుత్తు లైన్ తదితరాలన్నీ గిరిజన రైతులకు ఉచితంగానే కల్పిస్తున్నారు. అయితే ఐదెకరాలకు పైగా భూములున్న గిరిజనులను మాత్రమే సీఎం గిరి వికాసం పథకానికి అర్హులు గా ఎంపిక చేశారు. ఇప్పటికే జిల్లాలోని ఎంపీడీ వోలు సంబంధిత మండలాల్లో ఐదెకరాలకు పైగా భూమి ఉన్న అర్హులైన గిరిజనులకు సం బంధించి 228 బ్లాక్‌లకు చెందిన 1.474 ఎకరా లను గిరివికాస్ పథకానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికా రులు సర్వే నిర్వహించిన అనంతరం 326 మం ది రైతులను ఎంపిక చేశారు. ఐదెకరాలకుపైగా భూమి ఉన్న అర్హులైన గిరిజనులకు సంబంధించి గిరిజన రైతుల భూముల్లో బోర్లు తవ్వించి మిగ తా వసతులను కల్పిస్తున్నారు. అలాగే జిల్లాలో ఎంపిక చేసిన బ్లాక్‌లోని గిరిజనుల భూములకు నీరందించి సాగులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు 1,20,652 మంది ఉన్నారు.
గిరి వికాసం పథకంలో భాగంగా వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వం రూ.2.88 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇప్పటివరకు రూ.2.51 కోట్ల నిధులను జిల్లా యంత్రాంగం గిరిజన భూముల అభివృద్ధి కోసం ఖర్చు చేసింది. జిల్లావ్యాప్తంగా 228 బ్లాక్‌లను గుర్తించి 1,474 ఎకరాలకు గిరి వికాసం పథకానికి ప్రతిపాదనలను అందజేయ గా, 180 బ్లాక్ల్లోని 1,200 ఎకరాలకు సంబం ధించి సంబంధిత అధికారులు సర్వే ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటివరకు 107 బ్లాక్ల్లోని 747 ఎకరాలకు సంబంధించి 326 మంది గిరిజన రైతులను గుర్తించి వారి భూముల్లో బోర్లు వే యించడంతోపాటు మోటర్లు బిగించి, విద్యుత్తు లైన్ ఏర్పాటు చేయడంతోపాటు మిగతా సౌకర్యా లను గిరిజన రైతులకు అందుబాటులోకి తీసుకొ చ్చింది.
మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పథకం ద్వారా భూ అభివృద్ధి పనులు, బోర్ వెల్ రీచార్జ్ గుంతలు, పండ్ల తోటల పెంపకం, గ ట్లపై టేకు మొక్కల పెంపకం, పశువుల పాక, మే కలు, గొర్రెల పాక, కూరగాయల పందిరి, కంపో స్ట్ పిట్లు ఇస్తున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా జీవనోపాధుల పెంపుదలతోపాటు డ్రిప్, స్ప్రింక్ల ర్ పైపులను పంపిణీ చేయడంతోపాటు వ్యవసా య శాఖ ద్వారా విత్తనాలు, పరికరాలను సబ్సిడీ ద్వారా పంపిణీ చేస్తున్నారు. గిరి వికాసం పథకం తో ఎస్టీలను, చెంచులను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడంతోపాటు వివిధ ప్రాంతాలకు వల స వెళ్లిన చెంచులు, గిరిజనులు తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టారు.
గిరిజనుల అభ్యున్నతి కోసం బీడు, సాగు భూ ములకు ఉమ్మడి నీటి వినియోగ వసతులను కల్పిస్తూ వారి జీవన స్థితిగతులను పెంపొం దించేందుకు గిరి వికాసం పథకాన్ని తీసుకొ చ్చారు. గిరిజన తెగలకు చెందిన ఎస్టీ, చెంచు లకు సంబంధించిన చిన్న, సన్నకారు రైతుల భూ ములను సాగులోకి తీసుకొచ్చేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథ కంలో భాగంగా కనీసం ఇద్దరు అంతకు మించి ఎక్కువ మంది రైతులకు సంబంధించి కనీసం 5 ఎక రాలకుపైగా పొలం కలిగి ఉన్న గిరిజన రైతులు తమ ప్రతిపాదనలను స్థానిక సంబం ధిత అధికారులకు అందజేయాలి.
మండల స్థా యిలో సంబంధిత పథకం పర్యవేక్షణతోపాటు లబ్ధిదారుల ఎంపికకు మండల స్థాయిలో తహ సీల్దార్, విద్యుత్తు ఏఈ, ఎంపీడీవోలతో కమిటీ గిరి వికాసం పథకం కోసం ప్రతిపాదించిన భూ మిపై ఎలాంటి వివాదాలు లేవని ధ్రువీక రించాల్సి ఉంటుంది. సాగును దృష్టిలో పెట్టుకొ ని ఒక్కో బ్లాక్‌లో నిర్ణయించిన భూములకు సరిపడా సాగునీటిని అందించేలా బోరు వేయి స్తున్నారు. విద్యుత్తు సౌకర్యం, మోటర్ పంపు, పైపులు తదితరాలు ఉచితంగానే అంద జేస్తు న్నారు.
అలాగే ప్రతిపాదించిన బ్లాక్ సమీ పం లో చెక్‌డ్యాంలు, రాక్పిల్డ్యాం తదితర భూగ ర్భజల వనరులు పెంపొందేలా చర్యలు చేపట్టా రు. జియాలజిస్ట్‌లతో తొలుత సర్వే చే యించి వారి నివేదికల ఆధారంగానే ఎక్కడ భూగర్భ జలాలు ఉన్నాయో ఆ భూముల్లోనే బోర్లు వే యిస్తున్నారు. బోర్లు తవ్వించి, విద్యుత్తు సౌక ర్యం ఇప్పించడంతో పాటు మిగతా శాఖల ద్వా రా అవసరమైన వసతులను కల్పిస్తున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా బిందు సేద్యాన్ని గిరి జనుల భూముల్లో ఏర్పాటు చేయిస్తున్నారు.
అర్హులైన గిరిజన రైతులను ఇప్పటికే ఎంపిక చే శాం. సంబంధిత రైతుల భూములను సాగుకు యోగ్యంగా తీసుకొచ్చేందుకు అవసరమైన పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 107 బ్లాక్ల్లోని గిరిజన భూముల్లో బోర్లు, మోటర్లు బిగింపు, విద్యుత్తు లైన్ తదితర పనులకు రూ.2.51 కోట్ల నిధులను ఖర్చు చేశాం. గిరి వికాసం పథకంతో చాలా గిరిజన కుటుంబా లు రూపాయి ఖర్చు లేకుండా వారి బీడు భూ ములను సాగులోకి తీసుకురావడంతోపాటు ఆర్థికంగా బలోపేతం అయ్యారు.
– ఎంఏ.కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్