బండ్లగూడ,జూలై 14 : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. అక్రమ నిర్మాణాలను అడ్డు కోవలసిన అధికారులు అమ్యామ్యాలకు మరిగి ఎదో ఒక సాకులు చేపుతు అక్రమ నిర్మాణాదారులకు వత్తసు పలుకుతున్నారు.దీంతో కార్పొరేషన్ అదాయానికి భారీ స్థాయిలో గండిపడుతుంది. అధికారుల చేతి వాటంతోనే అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నాయనే అరోపణలు వినిపిస్తున్నాయి. నగర శివారును అనుకుని ఉండటంతో గృహా నిర్మాదారులు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.
నగరం ఐటీ రంగానికి అనువుగా ఉండటంతో ప్రజలు ఇక్కడ ఇళ్లు కోనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భవన నిర్మాణాదారులు అడ్డగోలిగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరైతే జీ ప్లస్ టు అనుమతులు తీసుకుని ఐదు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఆరె మైసమ్మ ప్రధాన రహదారి వద్ద వంద నుంచి నూటాయాబై గజాల స్థలంలో సెల్లార్ తీసి నిర్మాణం చేపట్టారు. అయా నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని స్థానికులు అడిగితే అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వాపోయారు.
హైదర్షాకోట్ గ్రామంలోకి వచ్చే ప్రధాన రహదారి పక్కనే గ్రామ పంచయతీ అనుమతులతో ఉన్న ఇంటిపై అదనంగా మూడు అంతస్తులను నిర్మిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి నిర్మాణాలు అనేకం చోటు చేసుకుంటుండగా వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు అమ్యామ్యాలకు మరిగారు. దీంతో కార్పొరేషన్‌కు భారీ గండి పడుతుంది. అధికారుల తీరుపై ఉన్నాతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అక్రమ నిర్మాదారులకు అండగా అధికారులు..
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్న అధికారులు అవేమీ తమకు పట్టనట్టుగా వ్యవరిస్తున్నారు. అక్రమ నిర్మాణదారులకు గురించి పిర్యాదు చేసిన అవున ఎక్కడ నేను చూడలేదు. నోటీసులు పంపుతాం అని వివరణ ఇస్తున్నారని ప్రజలు అరోపిస్తున్నారు. కొందరైతే తమ ఇండ్ల పక్కన జరుగుతున్న నిర్మాణదారులు సెట్‌బ్యాకులు లేకుండా నిర్మాణం చేస్తున్నారని పిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడంపై పిర్యాదు దారులు నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే స్లాబ్ స్లాబ్‌కు రెటు కట్టి మరి డబ్బులు వసులు చేస్తున్నారన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. అధికారులు డబ్బులకు అలవాటు పడి అక్రమ నిర్మాణాలకు పట్టించుకోకుండా అక్రమ నిర్మాణదారులకు వత్తసు పలుకుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు.