Kodangal | కొడంగల్, జూన్ 06 : రెండు వారాల కంటే అధికంగా దగ్గు తో పాటు బరువు తగ్గిన సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ వో, టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యాదవ్ సూచించారు. శుక్రవారం మండలంలోని చిన్న నందిగామాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ విత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బిపి షుగర్ గతంలోని టీవీ పేషెంట్లు తోపాటు టీబీ పేషెంట్ల కుటుంబ సభ్యులకు వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్యాంప్‌లో మొత్తంగా 105 మందికి ఉన్నట్లు గుర్తించి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. రెండు వారాల కంటే అధికంగా దగ్గు, బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని కాబట్టి సద్వినియోగం చేసుకొని వ్యాధి నుంచి కాపాడుకోవాలని కోరారు. నిర్వహించిన క్యాంపులో ఎవరికైనా వ్యాధి నిర్ధారణ కాపడితే వారికి ఆరు నెలల పాటు ఉచితంగా మందులు అందించడంతోపాటు పౌష్టిక ఆహారం కోసం ప్రతి నెల రూ. 1000 వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యాధినపడ్డ రోగులకు పౌష్టిక ఆహారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగడి రైచూర్ వైద్యాధికారిణి డాక్టర్ బుష్రా, వైద్యులు డా.లక్ష్మి డా.మహేందర్ డా. నికితలతోపాటు టీబీ సూపర్వైజర్ రహత్ అలీ, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.