Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం, జూన్ 3 : గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఈ సదస్సుల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి తెలిపారు. మంగళవారం ఇబ్రహీంపట్నం నియోకజవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి.
ముకునూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో పాల్గొన్న ఆర్డీఓ రైతుల భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు గ్రామగ్రామాన నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాలకు వచ్చే అధికారులకు తమ సమస్యలను విన్నవించి పరిష్కరించుకునేందుకు ప్రజలు, రైతులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునిత పాల్గొన్నారు. అలాగే, మండల పరిధిలోని కప్పాడు గ్రామంలో కూడా భూ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.