Vishwak Sen | కొత్తూరు : ప్రఖ్యాత జహంగీర్ పీర్ దర్గాలో సినీ నటుడు విశ్వక్సేన్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లైలా విడుదల సినిమా నేపథ్యంలో విశ్వక్సేన్.. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వలో ఉన్న ప్రఖ్యాత జేపీ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి తరుచుగా దర్గాను సందర్శిస్తానని చెప్పారు. లైలా సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకున్నానని చెప్పారు. ఫన్, యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, రొమాన్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిచామని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.