కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వానలు జోరుగా కురుస్తున్నాయి. వానకాలం ప్రారంభంలోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి నారు పోయడం, విత్తనాలు విత్తడం వంటి వ్యవసాయ పనుల్లో రైతన్నలు బిజీబీజీగా గడుపుతున్నారు.
శనివారం సైతం పలు మండలాల్లో భారీ వర్షం కురవగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో పొలాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.