ఇబ్రహీంపట్నం, జూన్ 5 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో వర్షం పడింది. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో గృహ వినియోగదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.