షాబాద్/మర్పల్లి/వికారాబాద్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన బీభ త్సం సృష్టించింది. శుక్ర, శనివారాల్లో కురిసిన వానకు మామిడికాయలు నేలరాలాయి, పంటలు దెబ్బతిన్నాయి, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పై కప్పు రేకులు లేచిపోయాయి.
శుక్రవా రం రాత్రి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ, లింగారెడ్డిగూడ, సాయిరెడ్డిగూడ, షాబాద్, ముద్దెంగూడ తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వానతో కుమ్మరిగూడ గ్రామానికి చెందిన పోనమోని కుమార్ అనే రైతు తన ఎనిమిది ఎకరాల్లో సాగు చేసిన మామిడితోటలో మామిడికాయలు నేలరాలాయి. పూలతోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
అదేవిధంగా వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండలంలోని కొంషెడ్‌పల్లి, మొగిలిగుండ్ల, బిల్కల్, దార్గులపల్లి తదితర గ్రా మాల్లో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు ఉల్లి, మొక్కజొన్న, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నా రు.
ఈ వానతో మండలంలో సుమారు 70 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు రైతన్నలు చెబుతున్నారు. కాగా, బిల్కల్కు చెందిన సురేశ్ అనే రైతు తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని ఉల్లి, జొన్న పంటలను సాగు చేశాడు. రెండు రోజుల్లో పంటను కొద్దామనుకునే సరికి వడగండ్ల వాన తనకు అపార నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అప్పులు చేసి పంటలు సాగు చేస్తే తనకు అప్పులే మిగిలాయని.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. అదేవిధంగా మో మిన్పేట మండలంలోనూ వడగండ్ల వాన కురిసింది. ఈ వానతో మోమిన్‌పేట సంతలో కూరగాయలు విక్రయించుకునే రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూరగాయలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి.