బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 15, 2020 , 23:54:30

జోరు వానలు..

జోరు వానలు..

బండ్లగూడ : మూడు రోజులుగా జోరుగా కురుస్తున్న వానలతో రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.  దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు మాన్‌సూన్‌ బృదాలతో  డ్రైనేజీలను శుభ్రం చేస్తూ రోడ్లపై నిలిచిన  నీటిని తొలగింపజేసి సహాయక చర్యలు చేపట్టారు. సర్కిల్‌ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఫిర్యాదు చేయాలని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌ సూచించారు.  

 బడంగ్‌పేట : నిరవధికంగా కురుస్తున్న వర్షాలతో నియోజక వర్గంలోని కాలనీలు జలమయంగా మారాయి.  బాలాపూర్‌లో 29 ఎంఎం, సరూర్‌నగర్‌లో 29.4 ఎంఎం, కందుకూరులో 34 ఎంఎం, మహేశ్వరంలో 14.4 ఎంఎం  వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని మిథిలానగర్‌లో, ఎంఎల్‌ఆర్‌ కాలనీలోని ఇండ్లలోకి వరద నీరు రావడంతో మంత్రి  సబితా ఇంద్రారెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.