పరిగి, అక్టోబర్ 6 : పరిగి డివిజన్ పరిధిలో భారీ వర్షం కురిసింది. దీంతో డివిజన్ లోని నాలుగు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పూడూ రులో అత్యధికంగా 83.1 మి.మీ., పరిగిలో 63.1 మి.మీ., కులకచర్లలో 50. 8 మి.మీ., దోమలో 26.1 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు వరద నీటితో ప్రవహించాయి. చెరువులు, కుంటలలోకి భారీగా వరద నీరు చేరింది. పరిగి మం డలంలోని లఖ్నా పూర్ ప్రాజెక్టు మరోసారి పెద్ద ఎత్తున అలుగు పారింది. బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురియడంతో వరద నీరు ఆయా ప్రాంతాల్లోని చెరువుల్లోకి చేరింది. మరోసారి భారీ వర్షాలతో వాగులన్నీ పొంగి ప్రవహించాయి.
కాగ్నా, కాక్రావేణి పరుగులు..
తాండూరు, అక్టోబర్ 6: తాండూరు నియోజకవర్గంలో బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం రాత్రి వరకు కురిసిన కుండపోత వర్షంతో నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల పంటపొలాల్లోకి వరదనీళ్లు చేరడంతో పంటలు పూర్తిగా మునిగి పోయాయి. కోకట్, గాజీపూర్ వాగులు రోడ్డుపైనుంచి పారడంతో తాండూరు- ముద్దాయిపేట్, తాండూరు-పెద్దేముల్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కందనెల్లి, మన్సాన్పల్లి, తాండూరు-చించొల్లి మార్గంలో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోవడంత పాటు పంటపొలాల్లో వరదనీళ్లు నిండిపోయాయి. కాగ్నానది, కాక్రావేణి నదులు పొంగిపొర్లడంతో నియోజకవర్గ ప్రజలు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. శివసాగర్, జుంటుపల్లి ప్రాజెక్టులు నిండి అలుగులు పారుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు నీటమునిగిన గ్రామాలు, కాలనీలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్ సూచించారు. వరద నీరు పారుతున్న రోడ్ల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ధారూరు మండల పరిధిలో..
ధారూరు, అక్టోబర్ 6: ధారూరు మండల పరిధిలోని దోర్నాల్-ధారూరు స్టేషన్ గ్రామాల మధ్య(ఉన్న కాగ్నా) తాత్కాలిక వంతెన, మండల పరిధి లోని నాగారం-మైలారం గ్రామాల మధ్య ఉన్న వాగులు పొంగిపోర్లుతున్నాయి. నాగస ముం దర్-రుద్రారం గ్రామాల మధ్య ఉన్న తాత్కాలిక వంతెన లు కొట్టుకుపోయాయి. నాగారం- మైలారం, గ్రామాల మధ్య ఉన్న వం తెన పై భారీగా నీరు ప్రవహిస్తున్నది. దోర్నాల్, అంపల్లి, గురుదోట్ల, నాగారం, కుమ్మరిపల్లి, పులిచింతల మడుగు తండా, శేరిగడ్డతండా, జీడిగడ్డ తండా, నాగారం, యాలాల్ మండల పరిధిలోని రాస్నం గ్రామాలకు రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. తరిగోపుల గ్రామంలో పోలాల నుంచి భారీగా నీళ్లు గ్రామంలోని ఇండ్లలోకి చేరుతున్నాయి.
తప్పిన ప్రమాదం
మండల పరిధిలోని దోర్నాల్ గ్రామానికి చెందిన దేవనూరు శివ, ఆయన భార్య మౌనికలు గురువారం ఉదయం దోర్నాల్ గ్రామం నుంచి వికారా బాద్‌కు వెళ్తుండగా నాగారం గ్రామ సమీపంలోని చిన్న వాగు దాటుతుండగా వరద ఉధృతికి వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. వెంటనే అప్ర మత్తమై ఇద్దరు కారులో నుం చి బయటకు దూకి చెట్టు కొమ్మల సాయంతో ప్రాణాలను రక్షించుకున్నారు. స్థాని కులు గమనించి తాళ్లసాయంతో దంప తులను ఒడ్డుకు చేర్చారు. జేసీబీతో కారును బయటకు తీశారు.
బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
కొడంగల్, అక్టోబర్ 6: పట్టణంలోని బాలాజీనగర్ వీధిలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది . చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. కొడంగల్ చెరు వుల అలుగు తెగిపోవడంతో వరదనీరు కుమ్మరివాడ వీధిలో చేరుకొని ఇండ్లలోకి నీరు వచ్చింది. ఇక్కసారిగా నీరు ఇండ్లలోకి చేరు కొంది. ఒక్కసారిగా నీరు ఇండ్లలోకి చేరుకోవడంతో వీధివాసులు ఉలిక్కిపడ్డారు. కొందరు ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాల్లో తలదా చుకున్నారు. మున్సి పల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బాలాజీనగర్ వీధికి చేరుకొని బాధితులను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత 30 సంవత్సరాల క్రితం కొడంగల్ చెరువు అలుగు తెగిపోయి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని, మళ్లీ ఇప్పుడు ఇటువంటి పరి స్థితిని చూస్తున్నట్లు ఎమ్మెల్యేతో మెరపెట్టుకున్నారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లి, తిండి గింజలు సైతం నీటిలో మునిగిపోయాని ఆదుకోవాలని విజ్ఞప్తి వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో సంప్రదించి బాధితులను ఆదుకోవాలని, తక్షణం వీరిని సురక్షిత ప్రాం తా లకు చేరవేయడంతో పాటు బియ్యం, నగదు పంపిణీ చేయాలని తెలి పారు. బాధితులకు బాధ్యత స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆహారాన్ని పంపిణీ చేశారు. మండలంలోని పర్సాపూర్ గ్రామ ర్యాలపేట చెరువుకు గండి పడిం ది. దాంతో సర్పంచ్ సయ్యద్ అంజద్తో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి గండి పూడ్చే చర్యలు చేపట్టారు.
పంటపొలాల్లోకి భారీగా వరదనీరు
బొంరాస్‌పేట, అక్టోబర్ 6: బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో బుధవా రం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురు స్తుంది. భారీ వర్షానికి వాగులు,వంకలు, చెరువు అలుగు పొంగి ప్రవహి స్తున్నాయి. తుంకిమెట్ల, బొంరాస్‌పేట, మెట్లకుంట చెరువు అలుగుల నుంచి వస్తున్న వరద నీరు రోడ్లపై నుంచి ప్రవహిస్తుండడంతో మెట్లకుంట, బొం రాస్‌పేట గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. తుంకిమెట్ల చెరువు అలుగు నీరు ఉధృతంగా ప్రవహించడంతో మాలెకాడిబావి పల్లె ప్రజలకు రాకపోకలు నిలిచిపో యాయి. మెట్లకుంట ఎల్లమ్మ చెరువు అలుగు నుంచి భారీగా వస్తున్న వరద నీరు వరి పొలాలను ముంచెత్తింది. చౌదర్పల్లి గ్రామంలో ఇళ్లముందు మోకాళ్ల లోతులో వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. కాగా భారీ వర్షాలతో వేరుశనగ విత్తనా లు వేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు మొలకెత్తకుండా భూమిలోనే కుళ్లిపోతాయేమోనని ఆందోళనచెందుతున్నారు. క్వింటాలుకు రూ.13 వేలు ఖర్చు చేసి విత్తనాలు కొనుగోలు చేశామని వర్షాలకు అవి మొలకెత్తకపోతే నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్‌లో రోడ్లు జలమయం
వికారాబాద్, అక్టోబర్ 6 : వికారాబాద్ పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యా యి. గెరిగెట్ పల్లి వెళ్లే రైల్వే బ్రిడ్జికింద భారీగా వరద నీరు పారడంతో అటుగా వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ధన్నారం వాగు ప్రధాన రోడ్డుపై ఉధృతంగా పారడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. మండల పరి ధిలోని ద్యాచారం వాగు వరద నీటితో పొంగి పొర్లడంతో ప్రధాన రహదారి కనిపిం చకుండా పోయింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో వివిధ పనులు నిమిత్తం పట్టణానికి వచ్చిన ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పెద్దేముల్ మండలంలో..
పెద్దేముల్,అక్టోబర్ 6 : మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో గురువారం తెల్ల వారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురిసింది.గురువారం తెల్ల వారుజామున ఓ మోస్తరుగా కురిసిన వర్షం ఉదయం 8.30 ప్రాంతంలో భారీగా కురిసింది. పెద్ద మొత్తంలో పంటపొలాల్లో, చెరువు, కుంటలు, వాగులు, కాలువల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉన్న చెరు వులు నిండుకుండల్లా మారాయి. వాగులు ్ల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
బంట్వారం మండలంలో..
బంట్వారం, అక్టోబర్ 6 : బంట్వారం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. మండల పరిధి లోని సల్భాత్తాపూర్, నూరుళ్ల పూర్ వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిం చాయి. ప్రధాన రోడ్లపై నీరు పారవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పో యా యి. సాయంత్రం వరకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
మత్తడి దుంకిన అయినాపూర్ పెద్ద చెరువు
దోమ,అక్టోబర్6: మండల పరిధిలోని అయినాపూర్ గ్రామ పెద్ద చెరువు 45 సంవ త్సరాల అనంతరం మత్తడి దుంకడంతో గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల ఉన్న మోత్కూర్, పాలేపల్లి, మల్లేపల్లి తదితర గ్రామాల ప్రజలు చూసేందుకు వచ్చారు. నియోజక వర్గంలోనే అతి పెద్ద చెరువు అయిన అయినాపూర్ పెద్ద చెరువు తొమ్మిది వందల ఎకరాల సాగు విస్తీర్ణం కలిగి ఉంది. ఒక్క సారి ఈ చెరువు నిండితే రెండు పంటలకు సరిపడా నీరు సరిపోతుంది. చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పార డం చూసిన గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. మత్స్య సంపదపై ఆధారపడ్డ మత్స్యకారులు సైతం ఆనందపడుతున్నారు. గొడుగోనిపల్లి దగ్గర రోడ్డుపై కుక్కల వాగు ఉధృతంగా పారడంతో దోమ పెద్ద చెరువు మత్తడి పారడంతో కాకరవేణీ వాగు ఉధృతంగా ప్రవహించి ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.