కొత్తూరు, అక్టోబర్ 13: మండల పరిధిలో బుధవారం రాత్రి జోరువాన కురిసింది. దీంతో పలు గ్రామాల చెరువులు అలుగు పారుతున్నాయి. మండల పరిధిలోని గూడూరులో ఉప్పరోనికుంట, చింతల్చెరువు, కుమ్మరికుంట అలుగు పారాయి. అలాగే సిద్ధ్దూపూర్లోని బొట్ట చెరువు, ఎర్రకుంట అలుగు పారాయి. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ చెరువు అలుగు పారింది. దీంతో పాటు కొడిచెర్ల గార్ల చెరువు కూడా అలుగు పారింది.
కడ్తాల్: మండల కేంద్రంతోపాటు పరిధిలోని ఆయా గ్రామాలు, తండాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు భారీ వాన పడటంతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. కడ్తాల్ గ్రామంలోని గుర్లకుంట, ఉప్పారాశి కుంట, దేవరా చెరువు, నాగిరెడ్డి కుంట, అన్మాస్పల్లి గ్రామంలోని అన్మాస్ చెరువు, రావిచేడ్ గ్రామంలోని నాగోని చెరువు, ఉసిని చెరువు, న్యామతాపూర్లో బాపని చెరువు, చల్లంపల్లి గ్రామంలో శమాషి కుంట, నాగుల చెరువు, సాలార్పూర్ గ్రామంలో పెద్ద చెరువు, ఏక్వాయిపల్లి గ్రామంలో నాగిరెడ్డి చెరువు, తుమ్మల చెరువు, ముద్విన్ గ్రామంలో నల్లకుంట, కర్ణామోని కుంట, చరికొండ గ్రామంలో గౌరమ్మ చెరువు, కర్కల్పహాడ్ గ్రామంలో నల్లకుంట, చాకలి కుంట, గోవిందాయిపల్లి చెరువులు పూర్తిగి నిండి అలుగుపారుతున్నాయి. మండల కేంద్రంలోని గుర్లకుంట అలుగుపారుతుండటంతో కడ్తాల్-గుర్లకుంట తండాకి మధ్య రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.